వందేమాతరం స్ఫూర్తిని తరాలకు అందించే బాధ్యత మనందరిదివందేమాతరం స్ఫూర్తిని తరాలకు అందించే బాధ్యత మనందరిది

వందేమాతరం గేయం రచించబడిన 150 ఏళ్ల సందర్భంగా రేగొండ మండలంలో దేశభక్తి జ్వాలలను రెచ్చగొట్టేలా ప్రత్యేక కార్యక్రమం జరిగింది.బీజేపీ రేగొండ మండల అధ్యక్షులు బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాణి విద్యానికేతన్ స్కూల్ విద్యార్థులతో కలిసి చిట్యాల రోడ్ సెంటర్ వద్ద స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. విద్యార్థుల దేశభక్తి నినాదాలతో పరిసరాలు మార్మోగాయి.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీజేపీ పార్లమెంట్ కో–కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్‌రావు మాట్లాడుతూ, “వందేమాతరం కేవలం గేయం మాత్రమే కాదు, భారత స్వాతంత్ర్య సమరయోధుల ఆత్మస్థైర్యానికి నాంది. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు రణనినాదంలా మారిన ఈ గేయం, బ్రిటిషు పాలనను సైతం గడగడలాడించింది. భారతీయుల నోట మంత్రంలా పలికిన వందేమాతరం పలికితే జైళ్ల పాల్జేసిన రోజులు ఉన్నాయి. ఆ గేయంలో ఉన్న శక్తి ఈ రోజూ ప్రతి భారతీయుడిలో దేశభక్తిని నింపుతుంది”అని అన్నారు.
శ్రీ బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించిన ఈ అమరగేయాన్ని భావితరాలకు ఘనంగా పరిచయం చేయడం మన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బండి శ్రీనివాస్ మాట్లాడుతూ,తరాలకు వందేమాతరం గేయ స్ఫూర్తిని చేరవేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు తరచుగా నిర్వహిస్తాం. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడం పార్టీ ధ్యేయం అని తెలిపారు.కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతిరెడ్డి, జిల్లా నాయకులు కాంతాల సర్వోత్తమ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి తూర్పాటి మల్లేష్, మండల ఉపాధ్యక్షులు గాండ్ల రమేష్, నాయకులు మేకల సాంబరెడ్డి, బూత్ అధ్యక్షులు దొంగల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *