మొద్దు నిద్ర వీడని అధికారులు మొద్దు నిద్ర వీడని అధికారులు

అధికార పార్టీ ప్లెక్సీలు తొలగించడంలో అధికారుల నిర్లక్ష్యం

రఘునాథ్ పల్లి మండలంలో ఎన్నికల కోడ్ అమలు లేదా?అని ప్రశ్నిస్తున్న ప్రజలు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఎన్నికల కోడ్ అమలు తీరుపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మంగళవారం సాయంత్రం నుంచే స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ,మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్లెక్సీలు,అలాగే బ్యానర్లు భారీ ఎత్తున అలాగే దర్శనమిస్తున్నాయి.ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే ప్రచార సామగ్రిని తక్షణమే తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా…రఘునాథపల్లి మండలంలో మాత్రం ఆ ఆదేశాల అమలు చేయడంలో అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదని విమర్శిస్తున్నారు.బహిరంగంగా కనిపిస్తున్న ఈ బ్యానర్లు,ఫ్లెక్సీల తొలిగింపుపై అధికారులు ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని,అసంతృప్తిని పెంచుతోంది.”ఎన్నికల కోడ్ అందరికీ ఒకటే కదా? మరి రూల్స్ ఉల్లంఘించినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని”స్థానికులు ఎన్నికల అధికారుల నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.సామాన్య ప్రజలు ఆపద సమయంలో డబ్బులు తరలిస్తే చూపే కఠిన వైఖరిని,నిబంధనలు ఉల్లంఘిస్తున్న రాజకీయ నాయకులపై,వారి ప్రచార సామగ్రిపై ఎందుకు చూపించడం లేదని తీవ్రంగా విమర్శిస్తున్నారు.అధికారంలో ఉన్న పార్టీ బ్యానర్లను తొలగించడంలో అధికారులు అశ్రద్ధ వహిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎన్నికల కోడ్ నియమావళిని కఠినంగా అమలు చేయాలని,తక్షణమే పరిస్థితిని సరిదిద్దాలని డిమాండ్ చేస్తున్నారు.ఎన్నికల కోడ్ అమలులో స్పష్టమైన లోపాలు కనిపిస్తున్న నేపథ్యంలో,దీనిపై జిల్లా ఎన్నికల అధికారులు ఎలా స్పందిస్తారన్నది ప్రస్తుతం మండలంలో చర్చనీయాంశంగా మారింది

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *