హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

హసన్ పర్తి మండలం సీతంపేట,నాగారం క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాలలో నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్

తెలుగు గళం న్యూస్ హనుమకొండ నవంబర్ 30

రెండో విడత మండలాల్లో సర్పంచ్,వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారం మొదలైంది.హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని సీతంపేట,నాగారం క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాలలో ఏర్పాటుచేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు.నామినేషన్ స్వీకరణ కేంద్రాలలో చేసిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.క్లస్టర్ నామినేషన్ల స్వీకరణ కేంద్రమైన సీతంపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏయే గ్రామాల పరిధిలో సర్పంచ్ వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణకు చేసిన ఏర్పాట్లను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద ఓటర్ల జాబితాను ప్రదర్శించాలని,హెల్ప్ డెస్క్ ద్వారా అభ్యర్థులకు నామినేషన్లకు సంబంధించిన సమాచారం అందించాలన్నారు.నామినేషన్ల స్వీకరణకు తగిన కౌంటర్లు ఉండాలన్నారు.ఎన్నికల విధులలో పాల్గొంటున్న అధికారులు,పంచాయతీ కార్యదర్శులు గుర్తింపు కార్డులను ధరించాలని సూచించారు.నాగారం క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా జెడ్పీ సీఈవో రవి,ఎంపీడీవో సుమనవాణి,తహసిల్దార్ కిరణ్ కుమార్,ఇతర అధికారులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *