డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్.డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్.

అవకాశం రాలేదని కృంగిపోకూడదు.

కష్టపడ్డ వారికి కచ్చితంగా సముచిత స్థానం కల్పిస్తా.

ప్రజల్లోకి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని తీసుకువెళ్లాలి.

డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్.

మహబూబాబాద్ జిల్లా తెలుగు గళం.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లి ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రతి కార్యకర్త పనిచేసే స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు. ఈ మేరకు మరిపెడ మండల కేంద్రంలోని భార్గవ ఫంక్షన్ హాల్ లో డోర్నకల్ నియోజకవర్గ స్థాయి సర్పంచ్ సన్నాహక సమావేశం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీర్ రెడ్డి అధ్యక్షతన సర్పంచ్ ఎన్నికల సన్నహాక సమావేశానికి ముఖ్య అతిథిగా డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ పాల్గొని మాట్లాడుతూ ఎన్నికల్లో అవకాశాలు రాలేదని ఎవరు కూడా చింతించవద్దని పది సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు గ్రామ పంచాయతీ ఎన్నికల తర్వాత నామినేటెడ్ పోస్టుల ద్వారా సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు. మండలంలోని 48 గ్రామపంచాయతీలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక కొరకు పార్టీ శ్రేణులు ఏకాభిప్రాయంతో సమిష్టిగా తీర్మానం చేసుకొని అందరితో కలిసి ఒకరు నామినేషన్ వేసే విధంగా ఉండాలని అన్నారు. ఈ పది రోజులు ఎంతో న్యాయంగా ధర్మంగా మంచి మనసుతోని ఎటువంటి కల్మషాలు లేకుండా గెలుపే లక్ష్యంగా కష్టపడి పార్టీని నిలబెట్టాలి. అవకాశాలు రాలేదని పార్టీలో ఉంటూ పరోక్షంగా ఎదుటివారితో లాలూచీ పడితే పార్టీ క్రమశిక్షణ పరంగా వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. స్థానిక ఎన్నికల తర్వాత కోట్ల రూపాయలతో మండలాలతో పాటు పల్లెల్లో మరింత అభివృద్ధి జరిగే విధంగా కృషి చేస్తానని అన్నారు. కావున ఎన్నికల ఇన్చార్జిలతో పాటు మండల నాయకులతో సమిష్టిగా ముందుకు పోతూ ఎన్నికల్లో నూటికి 90 శాతo గెలిచే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలి. స్థానికంగా పార్టీ పటిష్టంగా ఉంటేనే రాష్ట్రం, దేశంలో పార్టీ పురోభివృద్ధి చెందడం జరుగుతుందని ఆయన పార్టీ కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలోజిల్లా పార్టీ అధ్యక్షురాలుభూక్యా ఉమా, ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మాలోతు నెహ్రు నాయక్,మండల పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీర్ రెడ్డి, వంటికొమ్ము యుగేందర్ రెడ్డి, కొరవి మండల పార్టీ అధ్యక్షుడు అంబటి వీరభద్రం గౌడ్, మెరుగు సత్యనారాయణ, కాలం రవీందర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ సుధాకర్ నాయక్, ఐలమళ్ళు,అభినవ్ రెడ్డి, రాంలాల్, తజుద్దీన్, రవి నాయక్, నల్లు శ్రీకాంత్ రెడ్డి, పెండ్లి శ్రీనివాస్ రెడ్డి,నియోజకవర్గం లోని వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *