భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుభూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
  • భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి శాయంపేట
సర్పంచ్ ఎన్నికల్లో శాయంపేట మండలంలో వీలైనన్ని ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం అయ్యేలా చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు. ఈరోజు ఆదివారం సాయంత్రం భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండల కేంద్రంలోని ఎస్ వీ కే కే వేడుకల మందిరంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులతో జరిగిన సమావేశంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాంగ్రెస్ శ్రేణులకు పలు సూచనలు చేశారు. అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించుకోవాలని, వీలైనన్ని ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం అయ్యేలా చూసుకోవాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు వచ్చిన గ్రామాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎక్కడైనా ఆర్థికంగా బలహీనంగా ఉంటే, ఆ గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు ఆ అభ్యర్థి విజయానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలను, నాయకులను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టుకుని గెలిపించుకుని రావాలని పిలుపునిచ్చారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *