సర్పంచ్ స్థానాలకు 51,వార్డులకు 44 నామినేషన్లుసర్పంచ్ స్థానాలకు 51,వార్డులకు 44 నామినేషన్లు

సర్పంచ్ స్థానాలకు 51,వార్డులకు 44 నామినేషన్లు

తెలుగు గళం న్యూస్ హన్మకొండ

హనుమకొండ జిల్లాలో రెండో విడతగా జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ఐదు మండలాల్లో ప్రారంభమైంది.ధర్మసాగర్,హసన్‌పర్తి,ఐనవోలు,వేలేరు,పరకాల మండలాల్లో సర్పంచ్,వార్డు సభ్యుల పదవులకు అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు.మొదటి రోజే ఐదు మండలాల్లో కలిపి సర్పంచ్ స్థానాలకు 51,వార్డు స్థానాలకు 44 నామినేషన్లు వచ్చాయి.ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆర్ఓలు,ఏఆర్ఓలు నామినేషన్ పత్రాలను స్వీకరించారు.

మండలాల వారీగా నామినేషన్ల వివరాలు:

ధర్మసాగర్: సర్పంచ్ 21, వార్డులు 19

హసన్‌పర్తి: సర్పంచ్ 8, వార్డులు 11

ఐనవోలు: సర్పంచ్ 8, వార్డులు 6

వేలేరు: సర్పంచ్ 6, వార్డులు 6

పరకాల: సర్పంచ్ 8, వార్డులు 2

రెండో విడతలో నామినేషన్ల స్వీకరణ కోసం ప్రతి మండలంలోని క్లస్టర్ గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఇక,నామినేషన్ల ప్రారంభాన్ని జిల్లా అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు.హసన్‌పర్తి మండలంలోని సీతంపేట,నాగారం క్లస్టర్ కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తనిఖీ చేశారు.జడ్పీ సీఈవో రవి,పరకాల ఆర్‌డీవో డాక్టర్ కన్నం నారాయణ,ఇతర అధికారులు పరకాల మండలంలోని వెల్లంపల్లి,నాగారం,లక్ష్మిపూర్,కామారెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయాల్లో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు.ఎంపీడీవోలు కూడా తమ తమ మండలాల్లో కేంద్రాలను సందర్శించి పురోగతిని సమీక్షించారు.జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మొదటి రోజే ఉత్సాహంగా సాగింది.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *