7న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి. 7న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి.

ఈనెల 7న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయండి.

తెలుగు గళం హైదరాబాద్ సిఐటియు రాష్ట్ర ఐదో మహాసభలు 2025 డిశంబర్ 7 నుంచి 9వరకు మెదక్ పట్టణంలో జరుగుతున్నాం. డిసెంబర్ 7న బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఆ సభలో జాతీయ నేతలు పాల్గొనున్నారని, కావున కార్మిక వర్గం పెద్ద ఎత్తున బహిరంగసభలో పాల్గొనాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్లు పిలుపునిచ్చారు.
మంగళవారం స్థానిక సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కేంద్రం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో మెదక్ లో జరగబోయే రాష్ట్ర మహాసభల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షలు చుక్క రాములుమాట్లాడుతూ మహాసభల ప్రారంభ రోజున మెదక్ పట్టణంలో బహిరంగసభ నిర్వహిస్తున్నామని, ఈ సభకు ముఖ్యవక్తగా సిఐటియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి, CPI(M) పాలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, సిఐటియు అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత, జాతీయ కోశాధికారి ఎం. సాయిబాబులు ముఖ్య అతిధిలుగా హాజరు కానున్నారు. మహాసభను సిఐటియు అఖిల భారత ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని కార్మిక సంఘాల నేతలు కూడా హాజరవుతారని వారు తెలిపారు. ఈ మహాసభ నిర్వహాణకు జిల్లాల్లో అసంఘటిత రంగ కార్మికుల నుండి, స్కీం వర్కర్లతోపాటు ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు సహాయ సహకారాలు అందిస్తున్నారని చెప్పారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సభలకు వచ్చే ప్రతినిధులకు బస ఏర్పాట్లు కూడా చేస్తున్నారని తెలిపారు.
మహాసభలను ఒక కీలకమైన సందర్భంలో జరువుకుంటున్నామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొత్తం కార్మిక వర్గానికి ఉచ్చు బిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. యాజమానుల, కార్పొరేట్ల గరెసెల్లోకి లాభాల వరద పారించేందుకు నేడు లేబర్ కోట్లను అమలు చేస్తున్నామని ప్రకటించందన్నారు. కార్మిక హక్కులను తుంగలో తొక్కుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయకుండా తిరస్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభల్లో రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందింస్తామని వారు తెలిపారు.
ఈ సమవేశంలో సిబటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, రాష్ట్ర ఉపాద్యక్షులు భూపాల్, ఎస్వీ రవ, బి.ఎస్.రావ్, రాష్ట్ర కార్యదర్శులు ఎం.పద్మశ్రీ, వి.శ్రీకాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, వి. సుధాకర్, ఎ. సునిత తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *