కాంగ్రెస్ పాలనలో ప్రజలే పాలకులు.. ప్రజా సంక్షేమంకాంగ్రెస్ పాలనలో ప్రజలే పాలకులు.. ప్రజా సంక్షేమం

కాంగ్రెస్ పాలనలో ప్రజలే పాలకులు.. ప్రజా సంక్షేమం కోసమే ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు.ఆదివారం సాయంత్రం భూపాలపల్లి నియోజకవర్గం కొత్తపల్లిగోరి మండలం గాంధీనగర్, నిజాంపల్లి, కొత్తపల్లిగోరి గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధుల గెలుపు కొరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలల్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ కార్నర్ మీటింగ్ లలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… కొత్తగా ఏర్పాటైన మండలం కొత్తపల్లిగోరిని అన్ని విధాలా అభివృద్ధి చేసి, నియోజకవర్గంలోనే ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే చాలా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో నాయకులు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపు కొరకు కలిసికట్టుగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలే పాలకులని, ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసినట్లు తెలిపారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *