గ్రామ ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యంగ్రామ ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం

కాంగ్రెస్ పార్టీ రెబల్ సర్పంచ్ అభ్యర్థి గా రామసహాయం నర్సింహా రెడ్డి మరిపెడ మండలం రాంపురం గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా రాంపురం గ్రామం జనరల్ స్థానం రిజర్వ్ కావడంతో సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ రెబల్ సర్పంచ్ అభ్యర్థి గా రామసహాయం నర్సింహా రెడ్డి బరిలో నిలిచారు, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో సర్పంచ్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించి నట్లు తెలిపారు. గ్రామ అభి వృద్ధి, పారదర్శక పాలన, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం ఇవే తన ప్రాధా న్యతలు అని పేర్కొన్నారు గ్రామానికి అవసరమైన ప్రతీ పనిని సాధించేందుకు కృషి చేస్తాను అని చెప్పారు. నిరంతర ప్రజా సేవ చేయడం తన బాధ్యత అని హామీ ఇచ్చారు. ప్రజల హృదయా లలో నిలవడమే నా లక్ష్యం అంటూ ప్రజల ఆశీర్వాదం కోరారు. గ్రామ ప్రజల అభి మానం, సహకారమే తమ విజయం అన్నారు,తమ గ్రామాభివృద్ది కోసం అహర్నిశలు పాటు పడతానని తనను అందరూ ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలి అన్నారు,గ్రామంలో దళిత, బిసి, వెనుకబడిన తరగతుల చెందిన ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, వారి పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మంజూరు చేయించి అదుకోవడం జరుగుతుందన్నారు. ఎంతోమంది చదువుకుని గ్రామంలో నిరుద్యోగులుగా మిగిలిపోయారని వారికి స్థానిక పరిశ్రమలలో ఉపాధి పథకాలు మంజూరు చేయిస్తానన్నారు. చాలా మందికి పక్క గృహాలు లేకపోవడంతో ఇరుకు గదుల్లో జీవనం సాగిస్తున్నారని అర్హులైన వారందరికీ పక్క గృహాలు మంజూరు వేయించడానికి కృషి చేస్తానన్నారు. అర్హులైన వారందరికీ సామాజిక పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయిస్తానన్నారు. రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక ప్రతి ఏటా నష్టపోతున్నారని కమర్షియల్ పంటలు సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించి వారి అభ్యున్నతి కోసం పాటుపడతానన్నారు. గ్రామంలో తాగునీటి సమస్య శాశ్వత పరిస్కారం కోసం అవసరమైన చోట బోర్లు వేయించి ట్యాంకులు నిర్మించడం జరుగుతుందన్నారు. గ్రామంలో అవసరమైనచోట మురికి కాలువలు, సీసీ రోడ్లు నిర్మించడం జరుగుతుందన్నారు. అందరికీ అందుబాటులో ఉండి కుల మతాలకు అతీతంగా గ్రామ నర్వతోముఖాభివృద్ధికి కోసం ఆహర్నిశలు పాటు వడతానని అందరూ ఆశీర్వదించి తనను భారీ మెజారిటీతో టీవీ రిమోట్ గుర్తు పై ఓటు వేసి సర్పంచుగా గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమం లోయువ నాయకులు రామసహాయం మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు డాక్టర్ రామన్న గౌడ్,సుధాగాని బాలాజీ గౌడ్, కొమ్ము అవిలయ్య, కొమ్ము మల్లయ్య, ఈరగని రామ్ కుమార్ గౌడ్, ఈరగని నాగరాజు, ఈరగని అమరేందర్, ఈరగని సురేష్,ఈరగని సాయి కుమార్,కుంచం మహేష్,అలకుంట్ల వెంకన్న, అలవాల యాదగిరి,పాల్వాయి జంపయ్య, ఈరగని ఉమేష్, భయ్యా మహేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *