మరిపెడ మున్సిపాలిటి కేంద్రం లో ప్రభుత్వ విప్ పర్యటనమరిపెడ మున్సిపాలిటి కేంద్రం లో ప్రభుత్వ విప్ పర్యటన

తాగు నీటి సమస్య పరిష్కారనికి ఆదేశాలు జారీ మరిపెడ మున్సిపాలిటీ కేంద్రం లోని 15వ వార్డు ఆర్లగడ్డ తాండలో ప్రభుత్వ విప్,డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ పర్యటించడం జరిగింది. ఎమ్మెల్యే ఆర్లగడ్డ తండా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు,ఈ సందర్బంగా తండ లో నీటి సమస్య గురించి ఎమ్మెల్యేకి వివరించగా ఎమ్మెల్యే తక్షణమే మిషన్ భగీరథ ట్యాంక్ రిపేర్ చేయించి తాగునీటి నీటి సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కు తగు సూచనలు చెయ్యడం జరిగింది అన్నారు, త్యరితగతిన నీరు వచ్చే విధంగా చూడాలి అన్నారు,అదేవిధంగా ఆర్ల గడ్డ తండకు రోడ్లతో పాటు డ్రైనేజీ కట్టడం కోసం టెండర్ నిర్వహించడం జరిగింది ఆ పనులు కూడా త్వరితగతిన మొదలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషనర్ని ఆదేశించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మరిపెడ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీర్ రెడ్డి,మాజీ సర్పంచ్ రామ్ లాల్,మరిపెడ టౌన్ అధ్యక్షులు తాజుద్దీన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *