అంతర్ జిల్లాలు టీ-20 క్రికెట్ పోటీలు ప్రారంభంఅంతర్ జిల్లాలు టీ-20 క్రికెట్ పోటీలు ప్రారంభం

తెలంగాణ గ్రామీణ జిల్లాలలో క్రికెట్ అభివృద్ధి ధ్యేయంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాకా వెంకట స్వామి మెమోరియల్ అంతర్ జిల్లాల టీ-20 క్రికెట్ పోటీలను ఈరోజు వంగాలపెల్లిలోని డబ్ల్యుడిసీఏ క్రికెట్ మైదానంలో ప్రారంభించగా ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ క్రీడల్లో కాక వెంకటస్వామి కుటుంబంలోని మూడు తరాలు సేవ చెయ్యడమే కాకుండా రాబోయే తరాలకి ఆదర్శంగా నిలుస్తుందని కాక వెంకటస్వామి కుటుంబానికి క్రీడల పట్ల ఉన్న అంకిత భావాన్ని కొనియాడుతూ..ఇంత మంచి అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగపరుచుకొని జాతీయ స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గుండెటీ రవీందర్,బ్లాక్ కాంగ్రెస్ ప్రసిడెంట్ గోరంట్ల రాజు,జిల్లా ఉపాధ్యక్షులు సదాశివ,సంయుక్త కార్యదర్శి బస్వరాజు ఉపేందర్,కార్యవర్గ సభ్యులు అభినవ వినయ్,శంకర్ తదితరులు పాలొన్నారు.3 రోజుల పాటు మూడు వేదికలు జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో వంగాలపెల్లి మైదానంలో వరంగల్ జట్టు మహబూబాబాద్ జట్టుపై గెలుపొందగా
వరంగల్ జట్టులో రీష్యాంత్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఎంపికయ్యాడు.వరంగల్ లోని మొగిలిచర్ల గ్రౌండ్ లో జరిగిన మ్యాచులో హన్మకొండ జట్టు భూపాలపల్లి జట్టుపై గెలుపొందింది,మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా త్రిశూల్ ఎంపిక అయ్యాడు.ములుగులోని జాకరం గ్రౌండ్ లో జరిగిన మరో మ్యాచ్ జనగామ,ములుగు తలపడగా ములుగు విజయం సాధించింది,ములుగు జట్టులో సిద్దార్థ్ నాయక్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపిక అయ్యాడని వరంగల్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *