సీపీఐ శత వార్షికోత్సవాలు సీపీఐ శత వార్షికోత్సవాలు

లింగాల గణపురం మండల వ్యాప్తంగా సీపీఐ పార్టీ శత వార్షికోత్సవాల సందర్భంగా మండల హెడ్ క్వార్టర్ వద్ద సీపీఐ పార్టీ మండల కార్యదర్శి జెండావిష్కరణ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,రాజరిక వ్యవస్థల వ్యతిరేకంగా,బ్రిటిష్ వలస పాలనకు ఎదురు నిలబడి జాతీయ ఉద్యమంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారని అన్నారు.జాతీయత భావాలతో అలుపెరుగని పోరాటాలు నిర్వహించిన గొప్ప చరిత్ర కమ్యూనిస్టు పార్టీదని తెలిపారు.తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వేలాది గ్రామాలను విముక్తి చేసి,లక్షల ఎకరాల భూములను పేద ప్రజలకు పంచిన చరిత్ర సీపీఐకే దక్కుతుందని పేర్కొన్నారు.భూమి-భుక్తి-విముక్తి నినాదంతో దేశవ్యాప్తంగా అనేక ప్రజా ఉద్యమాలు సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయని అన్నారు.పేదల కోసం ఇళ్ల స్థలాలు,హక్కుల సాధనకు నిరంతర పోరాటాలు చేసిన పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పేరు బోయిన వీరస్వామి,నకిర్త రాములు,మాచర్ల కుమార్,బర్ల అంజయ్య,డి.అంజయ్య,మొటికే యాదగిరి,పి.వెంకన్న,ఎన్.కృష్ణరామ్,నరసయ్య,ఎం.శ్రీనివాస్,ఎన్.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *