భద్రాచలం హాస్పటల్ కు చికిత్స కోసం తరలింపు.భద్రాచలం హాస్పటల్ కు చికిత్స కోసం తరలింపు.
  • భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా
  • 60 మంది విద్యార్థులకు గాయాలు
  • ఇద్దరికి సీరియస్.. భద్రాచలం ఆస్పత్రికి తరలింపు..
    కొత్తగూడెం :
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాల్వంచలోని కేఎల్ఆర్ కళాశాలకు చెందిన బస్సు అకస్మాత్తుగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 60 మంది విద్యార్థినీ, విద్యార్థులు గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో ఒక విద్యార్థిని బస్సులో ఇరుక్కుపోయినట్లు సమాచారం కాగా, ఆమె పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా విద్యార్థులకు కూడా తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే స్పందించి వారిని సమీపంలోని ఆసుపత్రులకు ఇతర వాహనాల్లో తరలించారు. వీరిలో ఇద్దరికీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది.
    ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉండగా, సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు కారణం అతివేగమా..!?, నిర్లక్ష్యమా..!? అన్నది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *