తహశీల్దార్ ను సత్కరించిన కాంగ్రెస్,సీపీఎం నేతలుతహశీల్దార్ ను సత్కరించిన కాంగ్రెస్,సీపీఎం నేతలు

సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండల తహశీల్దార్ జె. మాణిక్ రావు ను మండలానికి చెందిన కాంగ్రెస్,సీపీఎం సీనియర్ నాయకులు బుదవారం సాయంత్రం తన ఛాంబర్ లో సత్కరించారు.
జనవరి 26 న గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఖమ్మం నగరంలో జరిగిన వేడుకలలో జిల్లా కలెక్టర్ అనుదీప్ చేతుల మీదగా ఉత్తమ తహశీల్దార్ గా వేంసూరు మండల తహశీల్దార్ జె. మాణిక్ రావు ప్రశంసాపత్రం పొందిన విషయం పాఠకులకు విదితమే.దానికి శుభాకాంక్షలు తెలుపుతూ నేతలు అభినందించారు.తహశీల్దార్ కు శాలువ కప్పి మిఠాయి తినిపించి సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో: ఖమ్మంజిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుచ్చకాయల సోమిరెడ్డి,రాయుడుపాలెం మాజీ సర్పంచ్ మేడా వెంకటేశ్వరరావు,చౌడవరం మాజీ ఎంపీటీసీ భూక్యా నాగులు,మర్లపాడు వైఎస్ సర్పంచ్ మందపాటి రాఘవరెడ్డి,మాజీ సర్పంచ్ భీమిరెడ్డి పావని శ్రీనివాసరెడ్డి, వేంసూరు సర్పంచ్ మహమ్మద్ ఫక్రుద్దీన్, లింగపాలెం వైస్ సర్పంచ్ గన్నేని సురేష్,సీపీఎం సీనియర్ నాయకులు అర్వపల్లి గోపాలరావు లు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *