జాతి పితాకు ఘన నివాళులుజాతి పితాకు ఘన నివాళులు

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వర్ధన్నపేట టౌన్‌ లోని మున్సిపల్ ఎన్నికల కార్యాలయంలో గాంధీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్, మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నెనీ రవీందర్ రావు, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు పార్టీ శ్రేణులతో కలిసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ:“సత్యం, అహింస, త్యాగం అనే విలువలతో దేశ స్వాతంత్ర్య పోరాటానికి నాయకత్వం వహించిన మహానీయుడు మహాత్మా గాంధీ. ఆయన ఆలోచనలు నేటికీ కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకం. ప్రజాసేవలో నిజాయితీ, పాలనలో పారదర్శకత, సమాజంలో ఐక్యతే గాంధీజీకి ఇచ్చే నిజమైన నివాళి” అని అన్నారు.
అలాగే యువత గాంధీజీ సిద్ధాంతాలను ఆచరణలోకి తీసుకొని, కాంగ్రెస్ పార్టీ ఆశయాలకు అనుగుణంగా శాంతి–సౌభ్రాతృత్వాలతో కూడిన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అనిమిరెడ్డి కృష్ణారెడ్డి, మొహమ్మద్ చోటే, అక్బర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *