పంచాయతీ ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయి గండ్రపంచాయతీ ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయి గండ్ర

పంచాయతీ ఎన్నికల ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ధీమా వ్యక్తం చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 16, 17, 29 వార్డుల పరిధిలో ఉన్న రాంనగర్, సుభాష్ కాలనీ, న్యూ సుభాష్ కాలనీల్లో సీపీఐ,సీపీఐ(ఎం) పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు.ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజుకుమార్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, ముఖ్య నాయకులు, ఆయా వార్డుల ఎన్నికల ఇన్‌చార్జీలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో నిర్వహించిన పబ్లిక్ కార్నర్ మీటింగుల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు.పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.అభివృద్ధి, సంక్షేమం నిరంతరం కొనసాగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల మద్దతుతో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ ప్రచారం ఉత్సాహభరిత వాతావరణంలో సాగిందని, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *