అమూల్యమైన ఓటు వేసి గెలిపించండిఅమూల్యమైన ఓటు వేసి గెలిపించండి

13 వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి రేఖ శైలజ అశోక్ యాదవ్ మరిపెడ మున్సిపాలిటీలోని 13వ వార్డు బిజెపి అభ్యర్థి రేఖ శైలజ అశోక్ యాదవ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరిపెడ గ్రామంలోని 13 వ వార్డులో గడప గడప తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అందరూ గమనించి చేసిన అభివృద్ధి పనులను,సంక్షేమ పథకాలను వార్డు సభ్యులకు వివరించారు.తమను కౌన్సిలర్ గా గెలిపిస్తే మీ అందరి సహకారంతో వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలిపారు. బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేసి తమను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ ప్రచారంలో కార్యక్రమానికి శ్రీనివాస్, సంతోష్,బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *