ఈ69 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన మంత్రి కొండా సురేఖఈ69 న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన మంత్రి కొండా సురేఖ

తెలుగు గళం న్యూస్ వరంగల్

వరంగల్:మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా తెలుగు గళం దినపత్రిక–ఈ69 న్యూస్ 2026 సంవత్సర క్యాలెండర్ ఘనంగా ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమం మర్యాదపూర్వక వాతావరణంలో నిర్వహించబడగా, పత్రిక ప్రతినిధులు, ఆహ్వానితులు, ప్రముఖులు హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ..ప్రజలకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్న తెలుగు గళం దినపత్రిక మరియు ఈ69 న్యూస్ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. క్యాలెండర్‌లో పండుగలు, ముఖ్యమైన తేదీలు, సామాజిక అవగాహన సందేశాలు చేర్చడం ద్వారా ప్రజలకు ఉపయోగపడేలా రూపొందించడం శ్లాఘనీయమన్నారు.మీడియా సంస్థలు సమాజానికి దిశానిర్దేశం చేసే బాధ్యతతో పనిచేయాలని ఆమె ఆకాంక్షించారు.తెలుగు గళం–ఈ69 న్యూస్ ప్రతినిధులు మాట్లాడుతూ పాఠకులకు మరింత చేరువయ్యేలా ప్రతి సంవత్సరం వినూత్నమైన క్యాలెండర్‌ను అందిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నాణ్యమైన వార్తలను అందిస్తామని చెప్పారు. కార్యక్రమం అనంతరం మంత్రిని నిర్వాహకులు సన్మానించారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *