మహిళా సాధికారత దిశగా మార్పు అనివార్యంమహిళా సాధికారత దిశగా మార్పు అనివార్యం

మన 75 ఏళ్ల స్వాతంత్ర్య దేశంలో,ఈ స్వర్ణోత్సవ వేళలో ఇంకా మహిళల సమానత్వంపై మాట్లాడుకోవడం ఓ విడ్డూర చర్య అని భావించక తప్పదు.
నాలుగు దశాబ్దాల క్రితమే అంటే 1990 92లో జాతీయ మహిళా కమిషన్ పేరుతో ఓ చట్టబద్ధసంస్థను ఏర్పాటు చేశారు.విధివిధానాలను కూడా రూపొందించినారు. అయినప్పటికిని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మహిళ యొక్క సాధికారత అనుకున్నంత ప్రగతి సాధించలేదు.ఇంకా చర్చాగోష్టులకే పరిమితమైందని చెప్పక తప్పదు.ఈ కమీషన్ ఏర్పాటు చేసింది ప్రధానంగా మహిళల హక్కులను పరిరక్షించడం, వారిపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టడం, మహిళా భద్రత,లింగ వివక్షత,అవసరమైన మహిళా సాధికారత సవరణలు,విధివిధానాల సవరణల రూపకల్పనలు చేయడం కోసం ఏర్పాటు చేసినారు.ఈ జాతీయ మహిళా కమిషన్ లో చైర్మన్, ఐదుగురు సభ్యులు మరియు కార్యదర్శి తదితరులుంటారు. వీరిని కేంద్ర ప్రభుత్వం‌ నియమిస్తుంది. మహిళల సంక్షేమం కోసం హెల్ప్ లైన్ నెంబర్లు 181,1098,100 ఇవి నిరంతరం అందుబాటులో ఉండే టోల్ ఫ్రీ నెంబర్లు. రైజ్ ఇండియా ఫౌండేషన్ భారతదేశంలోని అగ్రశ్రేణి మానవతావాద సమూహాల్లో ఒకటి.తక్కువ ఆదాయo ఉన్న ప్రాంతాలలో సేవలందిస్తున్న ఈ సంస్థ మహిళా సాధికారత కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు సైతం నిర్వహించింది. అందులో పాఠశాలకు వెళ్లే బాలికలకు మద్దతు ఇవ్వడం. ఆరోగ్య సేవలందించడం.మహిళల కోసం రూపొందించే అవగాహన కార్యక్రమాల్లో ప్రధాన పాత్ర వహిచండo ప్రధానమైనవి.మహిళలు పనిసి చోట వేధింపులు గనుక ఉంటే పోష్ యాక్ట్ (మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం) ద్వారా ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసే, సీబాక్స్ పోర్టల్ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది.
సమాన పనికి సమాన జీతం అనే వ్యత్యాసం ప్రధానంగా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోజున అన్ని రంగాలలో స్త్రీలు రాణిస్తున్నప్పటికీ ఇంకా పితృస్వామ్య వ్యవస్థ వేర్లు బలపడినాయని చెప్పక తప్పదు.ప్రతిచోట మహిళలపై చిన్న చూపు ఉందనేది వాస్తవం.ప్రతిచోట పురుషుల ఆదిపత్యమే నడుస్తున్నది.
ఆడది అబల కాదు సబల అని నిరూపించుకున్నప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో ఆమెకు సమన్యాయం అందటం లేదు.
మరీ ముఖ్యంగా ఆర్థిక స్వేచ్ఛకు అల్లంత దూరంలో ఉన్నారనేది జగద్విదితం.
ఇకనైనా ప్రభుత్వం వారికి మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలి.సామాజికవేత్తలు కూడా కొండంత అండగా నిలవాల్సిన చారిత్రక
సత్యముoదన్నది వాస్తవం.
ఆ దిశగా మార్పు అనివార్యం.

పరాంకుశం రఘు నారాయణ
గ్రామం :తొర్రూరు
మహబూబాబాద్ జిల్లా
చరవాణి: 9949749987

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *