1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తిరుపతి నాయక్ ఇంటింటా ప్రచారం.1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తిరుపతి నాయక్ ఇంటింటా ప్రచారం.

తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 1వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిరుపతి నాయక్ విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో నేరుగా మమేకమై, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటూ, వార్డు అభివృద్ధిపై తన దృష్టి, ప్రణాళికలను ప్రజలతో పంచుకున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తూ. పేదల జీవితాల్లో ఈ పథకాలు తీసుకొస్తున్న మార్పును తెలియజేస్తూ,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఒకటో వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిపించాలని అభ్యర్థించారు,ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జి మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *