మాట ఇచ్చి నిలబెట్టుకున్న సర్పంచ్మాట ఇచ్చి నిలబెట్టుకున్న సర్పంచ్

ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామ సర్పంచ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చి ఆదర్శంగా నిలిచారు. గత ఎన్నికల్లో గెలిచిన పుట్ట రేణుక కుమారస్వామి గత కొన్ని సంవత్సరాలుగా హరిజన స్మశాన వాటికలో వున్న నీటి సమస్యను గెలిచిన కొద్దీ రోజులలో తీర్చి ఆదర్శంగా నిలిచారు. హనుమకొండకు చెందిన చందుపట్ల రఘుపతి రెడ్డి నీటి మోటర్ దాతగా ముందుకు తీసుకొచ్చి గ్రామ పంచాయతీ బోరు వేసింది. బోరు విజవవంతం అవటంతో నీటి కొరత తీరిందని ప్రజలు హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సంధ్యా రాజిమారెడ్డి , మాజీ సర్పంచ్ బుద్దే రమేష్ , హరిజన కులస్తులు వక్కల వీరయ్య, వక్కల సుధాకర్, వక్కల భద్రయ్య, వక్కల కర్ణాకర్, వక్కల రవి,చిట్యాల కృపానంద్ , వక్కల వెంకటేష్, వక్కల అక్షిత్, కొలిపాక రాజు , గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *