భూభారతి రివిజన్ సర్వే – మూడు గ్రామాల సరిహద్దు రాయి గుర్తింపుభూభారతి రివిజన్ సర్వే – మూడు గ్రామాల సరిహద్దు రాయి గుర్తింపు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజు జనగామ జిల్లాలో రివిజన్ సర్వే కార్యక్రమం నిర్వహించారు.సహాయ సంచాలకులు, భూసర్వే విభాగం జనగామ జిల్లా ఆధ్వర్యంలో, ఘనపూర్ స్టేషన్ రెవెన్యూ డివిజనల్ అధికారి డి.యస్. వెంకన్న పర్యవేక్షణలో ఈ సర్వే చేపట్టారు.చిల్పూర్ మరియు ఘనపూర్ స్టేషన్ మండలాల పరిధిలోని చిన్న పెండ్యాల, రాజవరం, ఘనపూర్ స్టేషన్ గ్రామాలకు సంబంధించిన ట్రై జంక్షన్ (మూడు గ్రామాల సరిహద్దు) రాయిని అధికారులు గుర్తించారు.ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి డి.యస్. వెంకన్న మాట్లాడుతూ..భవిష్యత్తులో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే ఈ సర్వేను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సర్వే కార్యక్రమానికి రైతులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్లు వెంకటేశ్వర్లు,విజయ్ కుమార్, డిప్యూటీ సర్వే ఇన్స్పెక్టర్ రాజు, గిర్దావర్లు శ్రీకాంత్, లోకేష్, అలాగే మూడు గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *