15వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటా జోరుగా ప్రచారం15వ వార్డులో కాంగ్రెస్ ఇంటింటా జోరుగా ప్రచారం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొల్లు లక్ష్మి గెలుపు కోసం ఇంటింటా ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మరజోడు రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచారంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అభ్యర్థి బొల్లు లక్ష్మితో పాటు మాజీ జడ్పీటీసీ, జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీష్ చందర్ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జ్ కొలిపాక సతీష్, సునీత, మాజీ ఎంపీటీసీ గన్ను నర్సింహులు కళావతి, రఘునాథపల్లి మండల పార్టీ అధ్యక్షుడు కోళ్ల రవిగౌడ్, జిల్లా నాయకులు ఇబ్రహీం, నరగొని పద్మ, సరిత, వాసు తదితరులు పాల్గొన్నారు.ప్రచారంలో భాగంగా ఓటర్లను కలిసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. అభ్యర్థి బొల్లు లక్ష్మి మాట్లాడుతూ, వార్డు అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.స్థానికులు కూడా ప్రచారానికి సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *