ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే పోలీస్ శాఖ లక్ష్యంప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే పోలీస్ శాఖ లక్ష్యం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రతివారం నిర్వహించే ప్రజాదివాస్ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు.ఈ ప్రజాదివాస్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా ఎస్పీ స్వయంగా మొత్తం 10 ఫిర్యాదులను స్వీకరించారు.ఫిర్యాదుదారులు వ్యక్తం చేసిన సమస్యలను శ్రద్ధగా విని, ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తూ, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణమే స్పష్టమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.ఫిర్యాదులపై నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆదేశిస్తూ, సంబంధిత పోలీస్ స్టేషన్ సీఐలు, ఎస్‌ఐలతో నేరుగా ఫోన్ ద్వారా మాట్లాడి, కేసుల ప్రస్తుత స్థితిగతులపై సమగ్ర సమాచారం తెలుసుకున్నారు.అవసరమైన చోట చట్టపరమైన చర్యలు చేపట్టి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు తమ సమస్యలను ఎలాంటి పైరవీలు, మధ్యవర్తులు లేదా మూడో వ్యక్తుల జోక్యం లేకుండా నేరుగా పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని అన్నారు. పోలీస్ శాఖ ప్రజలకు సేవ చేయడానికే ఉందని, చట్టబద్ధమైన విధానంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలకు మరింత చేరువగా ఉండి, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించడంలో జిల్లా పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు.ప్రతివారం సోమవారం నిర్వహించే ప్రజాదివాస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరిస్తూ,సంబంధిత శాఖల సమన్వయంతో వాటిని వేగంగా పరిష్కరిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం అందించేందు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *