సిపిఎం ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేతసిపిఎం ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

ఏదులాపురం మున్సిపాలిటీ
గుదిమల్ల గ్రామానికి చెందిన మీసాల గోపమ్మ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నారు. వారికి సిపిఎం గుదిమల్ల శాఖ సహకారంతో మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సిఫారసుతో 21 వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ మంజూరు కాగా, సిపిఎం శాఖ కార్యదర్శి జింకా బాలరాజు, శానం వీరబాబు, సాల్వే ముత్తయ్య తదితరులు బాధితులకు అందించారు. సిపిఎం పార్టీ పేద ప్రజలకు ఏ ఆపద వచ్చినా తక్షణం ఆదుకునేందుకు ముందుంటుందని, అలాగే ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా ముందుండి పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, బాధితురాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *