ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యేఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.మున్సిపాలిటీ పరిధిలోని 30వ వార్డు సంఘమిత్ర కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర యువ నాయకులు గండ్ర గౌతమ్ రెడ్డి కూడా అదే కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఓటు వేసిన అనంతరం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్యానికి మంచి సూచిక అని పేర్కొన్నారు.ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను అభినందించారు.మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా పూర్తవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *