మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్‌కు ఆహ్వానంమహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్‌కు ఆహ్వానం

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను ఆలయ అధికారులు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ ఈఓ మహేష్, అర్చకులు మహాశివరాత్రి ఉత్సవాల ప్రాధాన్యతను కలెక్టర్‌కు వివరించారు. ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలు, రాత్రి జాగరణ, రథోత్సవం తదితర వేడుకలకు హాజరుకావాలని అధికారిక ఆహ్వాన పత్రికను అందజేశారు.ఆహ్వానం స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా కాళేశ్వరం మహాక్షేత్రానికి రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారని తెలిపారు.ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుధ్యం, తాగునీటి సౌకర్యం, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య సేవలు వంటి అంశాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ఉత్సవాల సమయంలో దేవాలయ ప్రాంగణం మరియు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను కాపాడుతూ, భక్తులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని పేర్కొన్నారు.మహాశివరాత్రి వేడుకలను కాళేశ్వరం మహాక్షేత్రంలో వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారుఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మహేష్, పూజారులు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *