ఎస్ఎఫ్ఐ పదవ తరగతి టాలెంట్ టెస్ట్ఎస్ఎఫ్ఐ పదవ తరగతి టాలెంట్ టెస్ట్

గత 40 సంవత్సరాలుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహణ : ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
టి.ప్రవీణ్

పదవ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం అభినందనీయం : త్రివేణి పాఠశాల ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగర కేంద్రంలో త్రివేణి పాఠశాలలో పదవ తరగతి టాలెంట్ టెస్ట్ పేపర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ కిమ్స్ హాస్పిటల్ వైద్యురాలు యార్లగడ్డ రజిత పేపర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ రజిత మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు విద్యార్థులకు పరీక్షల పైన ఉన్నటువంటి భయాన్ని పోగొట్టే దానికోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నారని తెలియజేశారు. అదేవిధంగా నేటి అధునాతన కాలంలో విద్యార్థులు వారి మేధో శక్తిని పోటీ ప్రపంచానికి అనుగుణంగా పెంపొందించుకోవాలని విజ్ఞానవంతులుగా మేధావులుగా తయారవ్వాలని తెలిపారు. ఉద్యమాలతో పాటు విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ లు పెట్టడం విద్యార్థులకు ఉపయోగమని అన్నారు. జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ విద్యార్థుల హక్కుల కోసం వారి సమస్యలపై పోరాడమే కాకుండా గత 40 సంవత్సరాలుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షల పైన ఉన్న భయాన్ని పోగొట్టేందుకు ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని అదే రీతిలో ఈరోజు పట్టణ మండల స్థాయి టాలెంట్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించామని తెలిపారు. ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా టాలెంట్ టెస్ట్ నిర్వహించడం అభినందనీయమని విద్యార్థులకు ఈ టెస్ట్ ద్వారా ఎంతో ఉపయోగం కలుగుతుందని తెలిపారు. ఈ పేపర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యురాలు సంగీత జిల్లా సహాయ కార్యదర్శి సాత్విక జిల్లా కమిటీ సభ్యురాలు సింధు జిల్లా కమిటీ సభ్యులు శ్రీనాథ్ నాయకులు లోకేష్, రమణ,లోహిత్ కుమార్, సాయి,గోపి, హారిక, అశోక్, భరత్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *