పంపు ఆపరేటర్ కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేసిన వేళపంపు ఆపరేటర్ కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేసిన వేళ

15 ఏళ్లకు అదృష్టం కలిసొచ్చిన వేళ కౌన్సిలర్ గా మారే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలవేళ సత్తుపల్లి మున్సిపల్ లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సత్తుపల్లి మున్సిపాలిటీలో రిజర్వేషన్లు ఖరారులో భాగంగా తొమ్మిదో వార్డు ఎస్టి జనరల్ కు రిజర్వేషన్ ఖరారు కావడంతో సత్తుపల్లి మున్సిపాలిటీలో 9వ వార్డులో గత 15 ఏళ్లుగా పంపు ఆపరేటర్ గా పనిచేస్తున్న జగన్నాథం శ్రీనివాసరావు పేరును ఖరారు. దీంతో అదే సామాజిక వర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన పూజల రవి పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగన్నాథ శ్రీనివాసరావు భారీ మెజార్టీతో (250ఓట్లు) గెలుపొందగా సోమవారం మున్సిపాలిటీలో పని చేసే పంప్ ఆపరేటర్ కౌన్సిలర్గా ప్రమాణస్వీకారం చేయడం పట్ల మున్సిపల్ లో పనిచేసే సహాయ సిబ్బంది, మున్సిపల్ ఉన్నత అధికారులు ఉద్యోగులు సిబ్బంది అరసం వ్యక్తం చేశారు.మున్సిపల్ లో పంప్ ఆపరేటర్ గా పనిచేసే జగన్నాథ శ్రీనివాసరావుకు కౌన్సిలర్ గా అవకాశం తగ్గటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సోమవారం జరిగిన ప్రమాణస్వీకారంలో మున్సిపల్ ఉద్యోగులు ఆయనను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. తమ తోటి ఉద్యోగి ప్రజాసేవలో మరింత మందికి ప్రజాసేవ చేయటం పట్ల మున్సిపల్ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, మున్సిపల్ ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచిన జగన్నాథం శ్రీనివాసరావును ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *