గులాబీ దళపతులు ప్రమాణ స్వీకారంగులాబీ దళపతులు ప్రమాణ స్వీకారం

ఓటర్ల తీర్పును శిరసా వహిస్తాం”

నాడు మేము అభివృద్ధి చేశాం: కూసoపూడి మహేష్(మాజీ మున్సిపల్ చైర్మన్)

ఈ నెల 11 న జరిగిన పురపోరులో 13 న జరిగిన కౌంటింగ్ లో సత్తుపల్లి పట్టణ ఓటర్లు ఇచ్చిన తీర్పును శిరసా వహిస్తామని గులాబీ దళపతులు(బిఆర్ఎస్) నుండి గెలుపొందిన వార్డు కౌన్సిలర్లు మీడియా వద్ద స్పష్టం చేశారు.సత్తుపల్లి పట్టణ సమగ్రాభివృద్ధికి నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అనేక నిధులను తెచ్చి పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని,మన ఊరు మన బడి కార్యక్రమంలో పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో మరమత్తులు చేయించామని,నూతన హంగులతో మున్సిపల్ కార్యాలయాన్ని నిర్మించామని,సీసీ రోడ్లు,త్రాగునీరు,వీధిదీపాలు,సమస్యలను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించామని, గ్రంధాలయం నిర్మించామని,పట్టణంలో ఇండ్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇచ్చామని,దోభిఘాట్,శాదీఖాన,క్రిస్టియన్ భవన్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు.నీలాద్రి అర్బన్ పార్కు ఏర్పాటుకు నాడే ఆమోద ముద్ర వేశామని మాజీ చైర్మన్,ప్రస్తుత 14 వార్డు కౌన్సిలర్ కూసంపూడి మహేష్ తెలిపారు.సోమవారం మున్సిపల్ కార్యాలయoలోని సమావేశ మందిరంలో జరిగిన నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం లో కూసంపూడి మహేష్,20 వార్డు నుండి బెల్లంకొండ రాము,02 వార్డు నుండి వీరపనేని బాబీ రాధిక,17 వార్డు నుండి కొత్తూరు తులసీ ఉమామహేశ్వరరావు,11 వార్డు నుండి జాన్ మహ్మద్ మీర్జా,12 వార్డు నుండి జొన్నలగడ్డ లత లు ప్రమాణ స్వీకారం చేశారు.వారికి కల్లూరు సబ్ కలక్టర్ అజయ్ యాదవ్,మున్సిపల్ కమీషనర్ కె.నరసింహ లు పుష్పగుచ్చాలు ఇచ్చి గౌరవించారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *