ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని ర్యాలీఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని ర్యాలీ

జఫర్గడ్ మండలంలో సిపిఐ ఆధ్వర్యంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. మండల ప్రధాన కార్యదర్శి జువారి రమేష్ నేతృత్వంలో కార్యకర్తలు తాసిల్దార్ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా జువారి రమేష్ మాట్లాడుతూ, జఫర్గడ్, కోణాయిచలం, తమ్మడపల్లి ఐ గ్రామాలలో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని ఆరోపించారు. అక్రమ ఆక్రమణదారులపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వెంటనే స్పందించి ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అలాగే తమ్మడపల్లి ఐలో అసంపూర్తిగా ఉన్న ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసి నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సిపిఐ మండల పార్టీ ఆధ్వర్యంలో భూములు, ఇండ్లు నిరుపేదలకు కేటాయించే కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు వడ్లకొండ సుధాకర్, సీనియర్ నాయకులు చంద్రమౌళి, మాజీ సర్పంచ్ ఉప్పునూతల మల్లయ్య, మహిళా సంఘం మండల నాయకురాలు ఎండి నూర్నిస, రైతు సంఘం మండల అధ్యక్షుడు ఎండి యాకూబ్ పాషా, కలకోట ప్రభాకర్, ఆరెల్లి రవి, వేల్పుల పెద్ద రాములు, చిలివేరి ఎల్లయ్య, నక్క బిక్షపతి, కొంతం రాజు, ఉప్పునూతల యశోద, నక్క ఎల్లమ్మ, వడ్లకొండ సంపూర్ణ, వేల్పుల పద్మ, ఎండి రిజ్వానా, ఎండి పర్రిఫా, మందపురి రజిత, బుల్లె సాయులు, యాకయ్య, ఎండి జాఫర్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *