ఎంపీ కడియం కావ్యకు వేం నరేందర్ రెడ్డి అభినందనలుఎంపీ కడియం కావ్యకు వేం నరేందర్ రెడ్డి అభినందనలు

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకంగా వ్యవహరించిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్యను ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. తొర్రూరు మున్సిపాలిటీ విజయంలో ఆమె పాత్ర ప్రశంసనీయమని పేర్కొన్నారు. అలాగే స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన సందర్భంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరికు శుభాకాంక్షలు తెలిపారు.ఇటీవల ఎమ్మెల్యే కడియం శ్రీహరి బావ మరణం నేపథ్యంలో నిర్వహించిన దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యేందుకు మహబూబాబాద్‌కు వెళ్తున్న సమయంలో ఎంపీ డా. కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తుండగా, రెడ్డియాల పర్యటనలో ఉన్న వేం నరేందర్ రెడ్డిని అనుకోకుండా కలుసుకున్నారు. ఈ సందర్భంగా వాహనాలను ఆపి పరస్పరం పలకరించుకుని కొద్దిసేపు ముచ్చటించారు. అనుకోని ఈ భేటీపై వేం నరేందర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళి నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రామచంద్రునాయక్, మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *