స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు.జఫర్‌గడ్ తహసీల్దార్ కార్యాలయం మరియు స్టేషన్ ఘనపూర్ రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 43 మంది లబ్ధిదారులకు రూ.43,04,988 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ నాయకులు అధికారాన్ని కుటుంబ హక్కుగా భావిస్తున్నారని ఆరోపించారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును “జాతిపిత”గా పేర్కొనడం తగదని, దేశానికి ఒకరే జాతిపిత అయిన మహాత్మా గాంధీ ఉన్నారని స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పునకు నిదర్శనమని పేర్కొంటూ, నియోజకవర్గ అభివృద్ధే తమ లక్ష్యమని తెలిపారు.అవినీతి రహిత, పారదర్శక పాలన అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *