సరఫరాతో పాటు సిబ్బంది భద్రత కూడా ముఖ్యమే: డిఈ బి. సారయ్య

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో బుధవారం రాత్రి:పట్టణ కేంద్రంలోని 33/11 కేవి విద్యుత్ ఉపకేంద్రంలో డిఈ ఆపరేషన్ ఘనపూర్ బి. సారయ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఉపకేంద్రంలోని ఫీడర్ల పనితీరును పరిశీలించి, విద్యుత్ సరఫరా పరిస్థితిపై లైన్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న సిబ్బందితో మాట్లాడుతూ, పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులు పర్యవేక్షణలో సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సరఫరా విధానాన్ని నిరంతరం గమనిస్తూ, నియంత్రికల వద్ద ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించాలన్నారు. అవసరమైన విద్యుత్ సామగ్రి ఏదైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు.రాత్రి వేళల్లో విధులు నిర్వహించే సిబ్బంది మరింత జాగ్రత్తగా ఉండాలని, సరఫరాలో అంతరాయం కలిగితే సంబంధిత సహాయ ఇంజనీర్లకు వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. విధుల నిర్వహణతో పాటు వ్యక్తిగత భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని హితవు పలికారు.ఈ తనిఖీలో లైన్ సిబ్బంది మోహమ్మద్ అన్వర్ పాషా, పన్నీరు సందీప్, అల్లావుల రాము, శ్రీను, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *