మహాన్యూస్ చైర్మన్ వంశీకృష్ణపై కేసు నమోదు చేయాలిమహాన్యూస్ చైర్మన్ వంశీకృష్ణపై కేసు నమోదు చేయాలి

పర్వతగిరి,మాజీ ఐపీఎస్,గురుకులాల మాజీ కార్యదర్శి, స్వేరోస్ ఫౌండర్ చైర్మన్ డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుమారులపై అసత్య ప్రచారం చేసిన మహాన్యూస్ చైర్మన్ వంశీకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్వేరోస్ నాయకులు పర్వతగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.స్వేరోస్ పర్వతగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందికట్ల ప్రవీణ్, అధికార ప్రతినిధి గారె జయరాజ్ పోలీసులకు ఫిర్యాదు అందజేశారు.
ఫిర్యాదు సారాంశం
డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను రాజకీయంగా ఎదుర్కోలేని కొందరి ప్రోత్బలంతో కక్షపూరితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుమారులు మంచివారేనా?అంటూ మహాన్యూస్ పోల్ నిర్వహించిందని,ఇది వ్యక్తిగతంగా కించపరిచే చర్య అని స్వేరోస్ నేతలు ఆరోపించారు.
స్వేరోస్ నేతల వ్యాఖ్యలు
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై బురద జల్లే ప్రయత్నం చేయడం ఆకాశం మీద ఉమ్మి వేయడమే.ఆయన కుటుంబం మహనీయుల ఆలోచనా విధానాల్లో నడిచే కుటుంబం. భూతద్దం పెట్టి వెతికినా వారి జీవితాల్లో చిన్న తప్పు కూడా దొరకదు.చదువు ద్వారానే జీవితాలు మారుతాయని నమ్మే కుటుంబం అది.పేద విద్యార్థులకు నిరంతరం సహాయం చేయడమే వారి ధ్యేయం. వారి గురించి తెలుసుకోవాలంటే సహాయం పొందిన వేలాది మంది పేద బిడ్డలను అడగండి” అని కందికట్ల ప్రవీణ్, గారె జయరాజ్ అన్నారు.
ఇంకోసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుటుంబం జోలికి వస్తే గతంలో మహాన్యూస్ ఛానల్‌పై తెలిపినట్లుగా స్వేరోలు తీవ్ర నిరసన తెలుపుతారు. ఆ తీవ్రతను మహాన్యూస్ యాజమాన్యం తట్టుకోలేదు అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో స్వేరోస్ భద్రాద్రి జోనల్ నాయకులు జంగిలి యాకయ్య, పర్వతగిరి మండల నాయకులు విజయ్, దినేష్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *