సాయిస్ఫూర్తిలో సైబర్ నేరాలపై అవగాహనసాయిస్ఫూర్తిలో సైబర్ నేరాలపై అవగాహన

సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని గంగారం గ్రామంలో గల సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ అటానమస్ కాలేజీ లో ఎన్సిసి విద్యార్డులకు సైబర్ క్రైమ్ డీఎస్పీ ఫణిందర్ అవగాహన బుధవారం కల్పించారు. దీనిలో భాగంగా ఐ‌పి‌ఎల్ టికెట్ బుకింగ్ ఫ్రాడ్,కొరియర్ స్కామ్,ఆన్లైన్ బుక్కింగ్ ఫ్రాడ్ ,డెలివేరి ఫ్రాడ్, ఇన్సూరెన్స్ ఆఫర్ ఫ్రాడ్ , లోన్ యాప్ అర్రాస్మెంట్ బ్లాక్ మెయిల్ , డిజిటల్ అరెస్టు ,ఇన్వెస్టెమెంట్ ఫ్రాడ్ ,బ్యాంక్ కె వై సి అప్డేట్ ఫ్రాడ్, ఆన్లైన్ సేఫ్టీ టిప్స్ , ఏపీకే ఫైల్ ఫ్రాడ్, బెట్టింగ్ యాప్ ల గురుంచి తెలిపారు. ఎవరైనా సైబర్ నేరానికి గురి అయితే వెంటనే 1930 కి కాల్ చేసి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో కేసు నమోదు చేయాలి అని తెలిపారు. వాట్సప్ టేలిగ్రామ్ యాప్ లలో అనుమానాస్పద లింకులు క్లిక్ చేయకూడదు అని, ఓటపి లు, బ్యాంక్ వివరాలు షేర్ చేయకూడదు అని తెలిపారు.ఈ కార్యక్రమములో , ఎన్సిసి 11(టి) బెటాలియన్ కల్నల్ సంజయ్ కుమార్ భద్ర, ఎల్ టి కల్నల్ విజయ్ కుమార్ , పంకజ్ ధోరన్ , కాలేజీ ప్రిన్సిపల్ శేష సాయి శ్రీ మరియు సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ సిబ్బంది ఎస్. ఐ. విజయ్ కుమార్ మరియు హెడ్ కానిస్టేబుల్ ఎం. ప్రసాద్, కానిస్టేబుల్ కృష్ణ ప్రసాద్ మహిళా కానిస్టేబుల్ వి. విజయ లక్ష్మి మరియు 500 మంది ఎన్‌సి‌సి విద్యార్దులు హాజరు అయ్యారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *