ఎస్ బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజర్ గా కొత్తపల్లి చంద్రశేఖర్ఎస్ బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజర్ గా కొత్తపల్లి చంద్రశేఖర్

స్వాగతించిన అడ్వైజర్స్”

ప్రజల తలసరి ఆదాయం బట్టి పాలసీలు చెప్పాలి”

సత్తుపల్లి,ఆర్ సి,జూన్02(తెలుగుగళం) న్యూస్: ఖమ్మంజిల్లా సత్తుపల్లి ఎస్ బి ఐ లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్ మేనేజర్ గా పని చేసిన చలమాల సాంబయ్య గత నెల 31 న భద్రాచలానికి బదిలీ అయిన విషయం పాఠకులకు విదితమే.ఆ స్థానంలో హైదరాబాద్ బాలానగర్ బ్రాంచ్ లో మేనేజర్ గా పనిచేస్తున్న కొత్తపల్లి చంద్రశేఖర్ ను బదిలీ చేయగా ఆయన సోమవారం విధులలో చేరారు.అట్టి విషయం తెలుసుకున్న ఏజెన్సీ మేనేజర్(ఏ.ఏం) తుంగల నాగరాజు టీమ్ లో గల అడ్వైజర్స్ మంగళవారం బ్రాంచ్ ను సందర్శించి మేనేజర్ చంద్రశేఖర్ కు స్వాగతం పలికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువ కప్పి ఘనంగా సత్కరించారు.అనంతరం జరిగిన అడ్వైజర్స్ అవగాహన సదస్సులో కొత్తపల్లి మోటివేషన్ క్లాసు బోధించారు.ఒక కుటుంబం వద్దకు ప్రజల వద్దకు వెళ్ళిన సమయంలో వారి హ్యూమన్ లైఫ్ వాల్యూ తీసుకొని దాని ఆధారంగా ఇన్సూరెన్స్ పాలసీలు చేర్పించాలని సూచించారు.ఈ నెల 05 న జరగబోయే వీర తెలంగాణ విజయ గర్జన మెగా లాగిన్ డే ను పురస్కరించుకొని భీమా లేని వారికి బీమాలు చేర్పించి వారి కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పించే దానికి అడ్వైజర్స్ తగినంత కృషి చేయాలని కోరారు. సేవా దృక్పథంతో పని చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో: ఏరియా మేనేజర్ తుంగల నాగరాజు, అడ్వైజర్స్ మల్లూరు చంద్రశేఖర్,మరికంటి నందిని,పేర్ల సత్యం,గుంజి రాంబాబు,సరభు శివనాధ ప్రభు తదితరులు పాల్గొన్నారు.

About The Author

One thought on “ఎస్ బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజర్ గా కొత్తపల్లి చంద్రశేఖర్””

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *