జడ్పీహెచ్ఎస్‌లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సుజడ్పీహెచ్ఎస్‌లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు

యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని వర్ధన్నపేట ఏఎస్ఐ మనోహర్ రావు పిలుపునిచ్చారు.ప్రపంచ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ జిల్లా పర్వతగిరి జడ్పీహెచ్ పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ‘ఈగల్ ఫోర్స్’ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.చదువు కన్నా సంస్కారం మిన్న: ప్రిన్సిపాల్
ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ పాక రమేష్ మాట్లాడుతూ,విద్యార్థుల జీవితంలో చదువు కన్నా సంస్కారం,క్రమశిక్షణే ముఖ్యమని పేర్కొన్నారు. డ్రగ్స్, మద్యపానం, ధూమపానం లాంటి చెడు వ్యసనాలకు బానిస కాకుండా, తప్పుడు స్నేహాలతో బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని హితవు పలికారు.’క్రమశిక్షణకు మాతృభాష మౌనం’ అని, ఏకాగ్రతతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఈగల్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుళ్లు రమేష్, కబీర్, శ్రావణ్ రెడ్డి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *