మహిళల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధిమహిళల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి

మహిళల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని అనంతారం సర్పంచ్ తౌటి శ్రీలత, సెర్ప్ సీసీ గోలి కొమురయ్య పిలుపునిచ్చారు.అనంతారం గ్రామంలో సరస్వతీ గ్రామైక్య సంఘం నెలసరి సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.గొర్రె సుకన్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహిళా రక్షణ చట్టాలు, వ్యక్తిగత పరిశుభ్రత, ప్లాస్టిక్ నివారణ, గృహహింస, వన మహోత్సవం అంశాలపై చర్చించారు.
ప్రధానాంశాలు:
1.మహిళా రక్షణ: మహిళలు, బాలల సంరక్షణ కోసం టోల్ ఫ్రీ నంబర్లు 100, 1098, 181 వినియోగించుకోవాలని సూచించారు.
2.పరిశుభ్రత: వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవుతుందని, ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
3.పర్యావరణం:ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని, హరిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని కోరారు.
4.మహిళా శక్తి:ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా శక్తి పథకాన్ని మహిళలంతా సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.సన్మానం:
మొదటిసారిగా సమావేశానికి హాజరైన సర్పంచ్ తౌటి శ్రీలత, ఇటీవల బాధ్యతలు చేపట్టిన పంచాయతీ కార్యదర్శి అనిత, ఎంపీవో శేషాంజనేయులును గ్రామైక్య సంఘాల ప్రతినిధులు శాలువాలతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ నాగమణి,సీసీ కొమురయ్య, కార్యదర్శి అనిత, ఏఎన్ఎం రజిత, వివోఏ మేకిరి రాజేశ్వరి, ఆశా వర్కర్లు,మహిళా సంఘాల లీడర్లు సుకన్య,సరోజన,పద్మ,శిరీష, రేణుక తదితరులు పాల్గొన్నారు

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *