న్యాయం చేయాలని హైకోర్టు న్యాయమూర్తి, సీఎంకు విజ్ఞప్తి

ఈ69న్యూస్ జనగామ సెప్టెంబర్ 07


​జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం రఘునాథపల్లె గ్రామానికి చెందిన బొమ్మినేని చంద్రారెడ్డి అనే వృద్ధుడు తనపై జరుగుతున్న వేధింపులకు నిరసనగా పాదయాత్ర చేపట్టారు.​గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి మరియు ఆయన అనుచరులు తనను తీవ్రంగా మానసికంగా హింసిస్తున్నారని, ‘పిచ్చివాడు’ అంటూ ఊరిలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు మాజీ సర్పంచ్‌పై ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా, తనకున్న రాజకీయ పలుకుబడితో కేసుల నుంచి తప్పించుకుంటున్నారని ఆరోపించారు.ఎక్కడికి వెళ్లినా తనకు న్యాయం జరగడం లేదని, ఇప్పటికైనా హైకోర్టు న్యాయమూర్తి గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని తనకు తగిన న్యాయం అందించాలని చంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *