” దోమలగూడ నుండి ర్యాలీ” ఇందిరాపార్క్ సిగ్నల్ వద్ద ధర్నా” తోపులాటలు” అరెస్టులు

“హైదరాబాద్,సెప్టెంబర్08 ఈ69 న్యూస్

ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ రేపు సెప్టెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు. అసెంబ్లీ సమావేశాల్లో ఫిక్స్డ్ వేతనం రూ.18,000/- లు నిర్ణయించకపోతే నిరవధిక సమ్మెకు వెళతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము.ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18,000/- లు అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయించాలని,ఉద్యోగ భద్రత కల్పించాలని ఇతర డిమాండ్స్ అన్నింటిని పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు సెప్టెంబర్ 8న ముందస్తు అరెస్టులు, తీవ్రమైన నిర్బంధం,అనేక ఆటంకాలను అధిగమించి వేలాదిమంది ఆశా వర్కర్లు ఛలో హైదరాబాద్ కు తరలివచ్చారు.దోమలగూడ నుండి ర్యాలీగా బయలుదేరి, అనంతరం ఇందిరాపార్కు సిగ్నల్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది.ధర్నా నినాదాలతో మారుమోగింది.అసెంబ్లీలో 18 వేల వేతనం నిర్ణయించాలని ఇతర డిమాండ్స్ అన్నింటిని పరిష్కరించాలని, పోలీసు జులుం ఆపాలని సీఎం డౌన్ డౌన్ అని నినాదాలు చేశారు. ఆశా వర్కర్లకు పోలీసులకు చాలాసేపు పెద్ద ఎత్తున ఘర్షణ,తోపులాటలు జరిగాయి. అనంతరం అరెస్టులు చేశారు. చాలామందికి గాయాలయ్యాయి.స్పృహ తప్పి పడిపోయారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఒకవైపు ప్రజాపాలన అంటూ మరొకవైపు నిర్బంధ పాలన కొనసాగించడం సరైనది కాదని ఈ అప్రజాస్వామికమైన విధానాన్ని నిర్బంధ పాలనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మానుకోవాలని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఆశా వర్కర్లు తగిన బుద్ధి చెప్తారని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేసుకునే అవకాశం కల్పించాలని సెప్టెంబర్ 4వ తేదీన పోలీసులకు పర్మిషన్ కోసం లెటర్ ఇచ్చామని అయినా రాష్ట్ర ప్రభుత్వం పరిమిషన్ ఇవ్వకుండా ఈ విధంగా నిర్బంధాన్ని ప్రయోగించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఒక వైపు ప్రజా పాలన అంటూ మరొకవైపు నిరసన తెలియజేసే హక్కు కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని అన్నారు.మంగళవారం ఉదయం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ని రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ వి. రమ ని మరియు తదితర నాయకులను మరియు వేలాది మంది ఆఆశా వర్కర్లను ముందస్తు అరెస్టులు చేయటంతో పాటు అన్ని చోట్ల తీవ్రమైన నిర్బంధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించింది. అయితే నిర్బంధాలతో పోరాటాలను ఆపలేరని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలను పరిశీలించి పరిష్కారం చేయాలని లేకపోతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్నీ హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాలు ముగించే లోపు ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ.18,000/- లు నిర్ణయించాలని,పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆగస్టు 14వ తేదీన ప్రజావాణిలో ఇచ్చిన వినతి పత్రంలోని డిమాండ్స్ అన్నింటినీ పరిష్కరించాలని లేనియెడల ఆశా వర్కర్లందరూ నిరవధిక సమ్మెకు సిద్ధమవుతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్బంధాన్ని నిరసిస్తూ రేపు సెప్టెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో: ఆశా యూనియన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షురాలు పి.జయలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఆర్ . నీలాదేవి,కోశాధికారి పి. గంగమణి సిఐటియు రాష్ట్ర కార్యదర్శులు వెంకటేశ్,పాలడుగు సుధాకర్ హైదరాబాద్ సెంట్రల్ కమిటీ సిఐటియు జిల్లా అధ్యక్షులు దశరథ సౌత్ కమిటీ సిఐటియు జిల్లా అధ్యక్షురాలు మీన ఆశా రాష్ట్ర నాయకులు శ్రీలత,యశోద, రేవతి, బాలమణి, సావిత్ర, ప్రవీణ, శ్రావ్య, రాజమణి, స్వరూప, అనిత, అమృత,మంగ తదితరులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *