హైదరాబాద్లో నిర్వహించనున్న భారత రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు వేంసూరు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో పాల్గొనేందుకు మండలంలోని వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు హైదరాబాద్కు బయలుదేరాయి.
ఈ కార్యక్రమంలో: మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాసర చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి పుచ్చకాయల సోమిరెడ్డి, అడసర్లపాడు మాజీ సర్పంచ్ వేల్పుల బుచ్చాలు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు వంట్ల కృష్ణార్జునరావు, డైరెక్టర్ ఒగ్గు కరుణాకర్ రెడ్డి, మాజీ డైరెక్టర్ గొర్ల వెంకటప్పరెడ్డి, చిలుకూరు పాపిరెడ్డి, లింగపాలెం ఉపసర్పంచ్ గన్నెని సురేష్, మర్లపాడు ఉపసర్పంచ్ మందపాటి రాఘవరెడ్డి, మండల కార్యదర్శి జెట్టి రామారావు, కోశాధికారి కర్రి నాగేశ్వరరావు, కారుమంచి రజనీప్రసాద్, విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీకి తరలివెళ్లిన వేంసూరు కాంగ్రెస్ నాయకులు



