సత్తుపల్లి- ఖమ్మం ప్రతి 20 నిమిషాలకు ఒక డీలక్స్ బస్సుసత్తుపల్లి- ఖమ్మం ప్రతి 20 నిమిషాలకు ఒక డీలక్స్ బస్సు

ఎక్స్ప్రెస్ చార్జీతో డీలక్స్ బస్సులలో ప్రయాణం
డీలక్స్ బస్సులకు మంత్లీ సీజన్ టికెట్లు
సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ వెల్లడి

సత్తుపల్లి బస్టాండ్ నుండి ఖమ్మం ,ఖమ్మం నుండి సత్తుపల్లి కి ప్రతి 20 నిమిషాలకు ఒక డీలక్స్ బస్సును ఏర్పాటు చేసినట్లు సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్స్ప్రెస్ చార్జీతో డీలక్స్ బస్సులలో ప్రయాణించవచ్చునని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రయాణికుల సౌకర్యం ఖమ్మం రూట్లో ప్రతి 20 నిమిషాలకు ఒక డీలక్స్ బస్సు ఏర్పాటు చేయడం జరిగిందని ప్రయాణికులు ఈ సదవకాశాన్ని సద్విని చేసుకోవాలని అన్నారు. డీలక్స్ బస్సులలో కూడా మంత్లీ సీజన్ టికెట్లు ప్రవేశపెట్టినట్లు ఆయన ప్రకటించారు. డీలక్స్ బస్సులలో 20 రోజులు చార్జీతో 30 రోజులు ప్రయాణించవచ్చునని అన్నారు అదేవిధంగా డీలక్స్ బస్సు కు రెండు నెలల సీజన్ టికెట్ తీసుకున్న వారికి అదనంగా ఐదు రోజులు , మూడు నెలల సీజన్ టికెట్ తీసుకున్న వారికి అదనంగా పది రోజులు ప్రయాణించే అవకాశం కల్పించినట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా మహిళలు 15 రోజులు చార్జీతో 30 రోజులు ప్రయాణించే విధంగా సీజన్ టికెట్లు సవరించినట్లు ఆయన వివరించారు. ఏదైనా సీజన్ టికెట్ కలిగి ఉన్న ప్రయాణికులు ఆదివారం సిటీలో ఉచితంగా ప్రయాణించే విధంగా ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. సీజన్ టికెట్ కలిగి ఉన్న ప్రయాణికులు రూట్ తో సంబంధం లేకుండా సూపర్ లగ్జరీ బస్సులలో బేసిక్ ఫెయిర్ లో పది శాతం రాయితీతో ప్రయాణించవచ్చునని అన్నారు. సత్తుపల్లి నుండి ఖమ్మం డీలక్స్ బస్సుల సమయపాలన వివరాలు
6.00,6.20,6.40,7.00,7.20,7.40,8.00,8.20,8.40,9.00,10.20,10.40,11.00,11.20,11.40,12.00,12.20,12.40,13.00,13.20,14.40,15.00,15.20,15.40,16.00,16.20,16.40,17.00,17.20,17.40,…
ఖమ్మం నుండి సత్తుపల్లి డీలక్స్ బస్సుల సమయపాలన వివరాలు….
8.10,8.30,8.50,9.10,9.30,9.50,10.10,10.30,10.50,11.10,12.30,12.50,13.10,13.30,13.50,14.10,14.30,14.50,15.10,15.30,16.50,17.10,17.30,17.50,18.10,18.30,18.50,19.10,19.30,19.50,….సత్తుపల్లి-ఖమ్మం , ఖమ్మం-సత్తుపల్లి ప్రయాణించే ప్రయాణికులు ఎక్స్ప్రెస్ చార్జీతో డీలక్స్ బస్సులలో ప్రయాణించి,ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సత్తుపల్లి డిపో మేనేజర్ గురిజాల లక్ష్మీనారాయణ కోరారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *