ఘనంగా ఆమ్ ఆద్మీ పార్టీ 14వ ఆవిర్భావ వేడుకలుఘనంగా ఆమ్ ఆద్మీ పార్టీ 14వ ఆవిర్భావ వేడుకలు

ఆమ్ ఆద్మీ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గురువారం ఘనంగా నిర్వహించారు.తొలుత జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నూరి సంతోష్ కుమార్ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించగా,జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నాగుల అరవింద్ మాట్లాడుతూ..దేశంలో అవినీతి అంతం చేయడమే లక్ష్యంగా 2012 నవంబర్ 26న అరవింద్ కేజ్రీవాల్ ఆప్‌ను స్థాపించారని గుర్తుచేశారు.అనతికాలంలోనే జాతీయ పార్టీగా ఎదిగిన ఆప్‌ను తెలంగాణలోనూ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని,ప్రజలు ఆదరించాలని కోరారు.రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య, వైద్యంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.జిల్లాలోని ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి వాసాల శ్రావణ్ కుమార్,జిల్లా సహాయ కార్యదర్శి మహమ్మద్ అస్లాం, పట్టణ నాయకులు మురళి, శ్రావణ్, శివ, అజయ్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *