వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను గ్రామ సర్పంచ్ జక్కీ అనిత శ్రీకాంత్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ జక్కీ అనిత శ్రీకాంత్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పంచాయతీ సిబ్బంది,గ్రామ పెద్దలు మరియు స్థానికులతో కలిసి భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా చదివి ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కీ అనిత శ్రీకాంత్ మాట్లాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదని చెప్పారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అందించిన ఈ రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛను కల్పించిందన్నారు.మన హక్కులను పొందడంతో పాటు,దేశ అభివృద్ధిలో భాగస్వాములవుతూ మన ప్రాథమిక విధులను కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.ఈ వేడుకల్లో పంచాయతీ కార్యదర్శి షేకు హుస్సేన్, ఉప సర్పంచ్ మేకల దేవేందర్,వార్డు సభ్యులు ముత్యం రేణుక,గ్రామ పెద్దలు,యువజన సంఘాల నాయకులు, మహిళలు మరియు పంచాయతీ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నల్లబెల్లిలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు



