80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ15 August, 2026E69NEWS

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి శ్రీ మామిడాల యశస్విని రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి, స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని అన్నారు.

వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, పాలకుర్తి నియోజకవర్గ ప్రగతికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.

ప్రజల ఆశయాలకు అనుగుణంగా నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *