జనగామలో వేతనాల కోసం సిఐటియు ఆందోళన
జనగామ మెడికల్ కాలేజ్ హాస్టల్ మరియు ఎం సి హెచ్ హాస్పిటల్ వర్కర్స్కు గత కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించకపోవడాన్ని సిఐటియు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయాన్ని అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ దృష్టికి తీసుకెళ్లుతూ సిఐటియు జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు నేతృత్వంలో వినతిపత్రం అందజేశారు.హాస్టల్ వర్కర్స్కు 6 నెలలుగా,ఎం సి హెచ్ వర్కర్స్కు 2 నెలలుగా వేతనాలు లభించక కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేసి కార్మికులను పర్మినెంట్ చేయాలని,నెలకు కనీసం రూ.26,000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.అలాగే పీఎఫ్,ఈఎస్ఐ,ప్రమాద బీమా,గుర్తింపు కార్డులు కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రామ్ దయాకర్,ఏనుగుల రఘు,గండి అజయ్ తదితరులు పాల్గొన్నారు.