శ్రీహరి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా గొడవలు సృష్టిస్తున్నాడు– బీఆర్ఎస్ నేతలు
ఈ69న్యూస్ జనగామ:-స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత శ్రీహరి అభివృద్ధి కార్యక్రమాలకన్నా, సెకండ్ క్యాడర్ నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేయిస్తున్నారని మండిపడ్డారు.బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మాచర్ల గణేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఏడు మండలాల అధ్యక్షులు పాల్గొని,శ్రీహరి రాజీనామా చేసి మళ్లీ ప్రజల తీర్పు పొందాలని డిమాండ్ చేశారు. రాజయ్య,పల్లా రాజేశ్వర్ రెడ్డిలపై దుష్ప్రచారం చేయడం సరైంది కాదని హెచ్చరించారు.కడియం శ్రీహరి రాజకీయ స్థిరత్వం లేకుండా పదవుల కోసం పార్టీ మారుతున్నారని,ఇలాంటి సంస్కృతి తమకు లేదని వారు స్పష్టం చేశారు.కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.