ఐనవోలులో ఘనంగా దొడ్డి కొమురయ్య 79వ వర్థంతి ఈ69న్యూస్ హన్మకొండ:తెలంగాణ తొలి వీర అమరుడు దొడ్డి కొమురయ్య 79వ వర్థంతిని పురస్కరించుకొని శుక్రవారం హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గొర్రెలు-మేకల పెంపకదారుల సంఘం మండల ప్రధాన కార్యదర్శి నల్లబెట్ట చిన్న రాజు యాదవ్ పాల్గొని చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు.అవకాశవాద దొరల జులుం వ్యతిరేకంగా సాయుధ ఉద్యమానికి బాటలు వేసిన కొమురయ్య త్యాగం వల్లే తెలంగాణ ప్రజల్లో చైతన్యం కలిగిందని ఆయన గుర్తు చేశారు. ప్రజలు కూడా ఐక్యంగా నేటి సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.