
* నిర్వహించిన స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే తనయుడు శ్రీ బొజ్జపల్లి సుభాష్* E69 news స్టేషన్ ఘనపూర్స్టేషన్ ఘనపూర్ మండలలో శివునిపల్లి గ్రామం లో శ్రీ లలితాంబిక ఆలయంలో కాలభైరవుడి అష్టమి సందర్భంగా ఈరోజు స్వర్గీయ మాజీ శాసనసభ్యులు బొజ్జపల్లి రాజయ్య తనయుడు బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ ఆలయానికి వెళ్లి కాలభైరవ స్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం,మంగళ నీరాజనం మంత్ర పుష్పoతో ప్రత్యేక పూజలు జరిపించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఆ కాలభైరవుడి ఆశీస్సులు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ఎలాంటి, రోగాలు ప్రజల దరి చేరకుండా ఆరోగ్యాన్ని ప్రసాదించి కరువు కాటకాలు లేని,ఆకలి దప్పులు లేని మంచి జీవితాన్ని ప్రజలకు ప్రసాదించాలని కోరుతూ ఆ కాలభైరవుడికి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు బిజెపి జిల్లా నాయకలు బిజెపి నాయకులు,ప్రధాన కార్యదర్శులు,కార్యకర్తలు,వివిధ మొర్చాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.